ఏపీ సీఎం చంద్రబాబు, పవన్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ‘ఎక్స్’లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఏడాది బాలుడిని కుక్కలు చంపడంపై ఆయన ఇవాళ స్పందించారు. ‘వాడి మీద కేసు పెడదాం. వీళ్లను బొక్కలో వేద్దాం. మొత్తాన్ని చితక్కొడదాం అనే వాటి మీద నుంచి దృష్టి ఇలాంటి ఘోరాల మీద పెట్టండి. ఈ వార్త చూస్తేనే హృదయం ద్రవిస్తోంది’ అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.