AP: అధికార గర్వంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు ఆనాడు అసభ్యకర పోస్టులు పెట్టారని, పిచ్చికూతలు కూశారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళవారం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రజలను కష్టాల పాలు చేసింది. మహిళలని చూడకుండా నోటితో చెప్పలేని పదజాలంతో బూతులు తిట్టారు. ప్రశ్నించిన వారిపైనే కేసు పెట్టారు. ఇప్పుడు వారికి అరెస్టు భయం పట్టుకుంది. ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.’ అని అన్నారు.