TG: ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమాలు నడవవు అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'హైడ్రా మీద, మూసీ మీద మాట్లాడిన వాళ్లకు రూ. 5 వేలు ఇచ్చి మాట్లాడించారని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అదే నిజమైతే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా మీద, మూసీ మీద ఎందుకు తోక ముడిచారో చెప్పాలి. అక్కడ మాకు తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ వాల్లే స్వచ్ఛందంగా వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారు' అని అన్నారు.