ఈ నెల 18న అంటే శివరాత్రి రోజున కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. కుంభరాశిలో శని, సూర్యుడు, చంద్రుడు కలవడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీని వల్ల శివరాత్రి నుంచి కొన్ని రాశులవారికి మంచి జరగనుంది. త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల మేష రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారికి అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశముంది. శుభవార్తలు వింటారు. మకర రాశి వారికి త్రిగ్రాహి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. వారు కూడా శుభవార్తలను వింటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి.