శుక్రవారం రోజున కొన్ని చేయకూడని పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందట. అందుకే కొన్ని పనులను శుక్రవారం అస్సలు చేయొద్దని చెబుతారు. ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం.
శుక్రవారం రోజు లక్ష్మి దేవి శాశ్వతంగా ఇంటికి వచ్చే రోజు కావున ఈ రోజున అమ్మవారిని అస్సలు బయటకు తీయొద్దు. అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా పాత లేదా విరిగిన అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. అలా చేసే దేవతకు వీడ్కోలు పలికినట్లే. అందుకే శుక్రవారం రోజున ఇంట్లో నుంచి పాత విగ్రహాన్ని బయటకు తీయొద్దని చెబుతారు. అలా చేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. తద్వారా ఆర్థిక సమస్యలు వస్తాయి.
శుక్రవారం సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి. ఆ సమయంలో లక్ష్మీ దేవి తన భక్తుల ఇళ్ళకు వెళ్తుందని, ఇంటి తలుపులు మూసి ఉంచితే లక్ష్మీదేవి వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు. ఇలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం తగ్గుతుంది. ఆ రోజు అప్పులు ఇవ్వడం మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది.
స్త్రీలను గౌరవించి పూజించిన చోట స్వయంగా దేవతలు తిరగాడతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు కొంతమంది స్త్రీలు లక్ష్మీ దేవి ఉపవాసం పాటిస్తారు. కాబట్టి ఆ రోజున ఇంటి లక్ష్మిని, ఇంట్లోని స్త్రీలను దూషించడం, కొట్టడం లాంటివి చేయవద్దు.
శుక్రవారం రోజున లక్ష్మిదేవి విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. మీ ఇంటికి లక్ష్మీ దేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు. కానీ వేరే ఎవరికీ ఇవ్వొద్దు.