ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బదిలీల్లో ఉపయోగపడేలా వారి పనితీరుకు ప్రోత్సాహక పాయింట్లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. త్వరలోనే బదిలీలకు సంబంధించి ప్రభుత్వం చట్టాన్ని తీసుకురాబోతోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ ముసాయిదా బిల్లు పెట్టాలని భావిస్తోంది. అందులో పాయింట్ల అంశాన్ని చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒకేచోట ఎనిమిదేళ్లు పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.