ఉగాది పచ్చడి పరమార్థం ఇదే..!

545చూసినవారు
ఉగాది పచ్చడి పరమార్థం ఇదే..!
ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక. ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు. చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు- వగరు- కొత్త సవాళ్లు. కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.