ఏపీలో ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు

52చూసినవారు
ఏపీలో ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరిన్ తీరంతో పాటు దానికి ఆనుకుని దక్షిణ తమిళనాడు పరిసరాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలోను, రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ద్రోణి ఎఫెక్ట్ కూడా కొనసాగుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్