పార్వతీపురం మన్యం జిల్లా
లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంటపొలాల్లో ఏనుగుల గుంపు స్వైరవిహారం చేస్తున్నాయి. అరటి తోటలు, పంట పొలాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. రోడ్డుపైకి
వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏనుగులను దారి మళ్లించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తోంది.