ఢిల్లీలోని మహిళా కాలేజీలకు బెదిరింపు కాల్స్

64చూసినవారు
ఢిల్లీలోని మహిళా కాలేజీలకు బెదిరింపు కాల్స్
ఢిల్లీలోని పలు కాలేజీలకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్, వెంకటేశ్వర కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సోదాలు చేపట్టారు. బుధవారం కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బూటకపు బెదిరింపు కాల్ తేల్చిన మరుసటి రోజే బెదిరింపులు రావడంపై అధికారులు అయోమయానికి గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్