ముగ్గురి పిల్లలపై పడ్డ పిడుగు (వీడియో)

71చూసినవారు
వర్షాకాలంలో తరచూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. అదే సమయంలో పిడుగులు కూడా పడుతుంటాయి. పిడుగుల వల్ల చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. ఇదే కోవలో ఇటీవల అమెరికాలోని ప్యూర్టోరికోలో షాకింగ్ ఘటన జరిగింది. బీచ్‌లో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై పిడుగు పడింది. తల్లిదండ్రులు అప్రమత్తమై వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 12 ఏళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.