ముంబయిలో భారీ వర్షాల ప్రభావం ఎయిర్‌పోర్టుపై తీవ్రంగా ఉంది. కొద్దిసేపు రన్‌వే కార్యకలాపాలను సస్పెండ్ చేయగా.. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఇవి హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయి. ఇక తెల్లవారుజామున 2.22 నుంచి 3.40 వరకు రన్‌వేపై కార్యకలాపాలను నిలిపివేశారు. తాము అరైవల్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.