ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా మలికిపురంకి చెందిన ఓ యువతికి మెసేజ్ చేశాడంటూ.. AFDT జూనియర్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ముగ్గురు యువకులు దారుణంగా కొట్టారు. యువతికి మెసేజ్ ఎందుకు చేశావని యువకుడిని మందుబాటిళ్లతో చితకబాదారు. ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.