తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. సోమవారం పలు దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. వచ్చే ఏడాది మార్చి నెల అంగప్రదక్షిణం టోకెన్లు రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనం (జనవరి 10 నుంచి 19) శ్రీవాణి టికెట్లు సోమవారం ఉదయం 11 గంటకు రిలీజ్ చేయనుంది. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరింది.