బాలగంగాధర్ తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. అతను తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో అతను విశేష ప్రతిభ కనబరిచేవారు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణం కలవారు. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయన సహజగుణం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.