నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండల పరిధి వల్లాల గ్రామంలోని శ్రీ పార్వతీ శంభు లింగేశ్వర ఆలయం భక్తుల కోర్కెలు తీర్చడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో గత 70 సంవత్సరాలుగా ‘నందా దీపం’ అనేది ఆనాటి నుంచి నేటి వరకూ వెలుగుతోంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా, అలాగే సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ఎలాంటి కోరికలు అయినా తీరాలంటే నందా దీపం వెలిగిస్తే తీరుతాయని అర్చకులు చెబుతున్నారు.