అమృత్ టెండర్లలో మొత్తంగా రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణానికి రేవంత్ పాల్పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 'రెండు నెలల కిందనే ఈ భారీ కుంభకోణంపై మాట్లాడిన బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మూగబోయిండు? కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే, విచారణ జరిపి టెండర్లను రద్దు చేయాలి' అని డిమాండ్ చేశారు.