భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు మృతి

54చూసినవారు
భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులను ఆలయానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. పిల్లలతో సహా 20 మంది గాయపడ్డారు. కొందరు భక్తులు రతన్‌గఢ్ మాతా మందిరానికి ట్రాక్టర్‌ ట్రాలీలో వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మైథాన పాలి ప్రాంతం సమీపంలో ఆ ట్రాక్టర్‌ అదుపుతప్పింది. 15 అడుగుల కల్వర్టులోకి దూసుకెళ్లింది.

ట్యాగ్స్ :