ఉక్రెయిన్‌కు అండగా G7 దేశాలు

75చూసినవారు
ఉక్రెయిన్‌కు అండగా G7 దేశాలు
ఉక్రెయిన్ రష్యాల భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఉక్రెయిన్​‌కు రూ.4.17 లక్షల కోట్ల (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. రష్యా పరిహారం చెల్లించేదాకా, ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదనీ అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్‌కు అందనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్