సంక్రాంతి పండుగ పూట విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బొండపల్లి మండలం గొట్లం గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. యువకులు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.