రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. భర్త హఠాత్మరణం తట్టుకోలేక భార్య, కుమారుడు కూడా మృతి చెందారు. కోత్రి సబ్‌డివిజన్‌లోని బద్లియాస్ గ్రామానికి చెందిన సత్యనారాయణ సోని శనివారం మృతి చెందారు. అయితే భర్త మరణంతో షాక్ కు గురైన భార్య మమత, కుమారుడు అశుతోష్ ఆదివారం అపస్మారక స్థితికి చేరుకున్నారు. దాంతో వారిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.