ప్రభుత్వ పెద్దల్లో వణకు పుడుతోంది: ఎమ్మెల్సీ కవిత

55చూసినవారు
ప్రభుత్వ పెద్దల్లో వణకు పుడుతోంది: ఎమ్మెల్సీ కవిత
నారాయణ‌పేట(D) మాగనూరు జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆందోళన చేసే ఛాన్స్ ఉండటంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోందన్నారు. ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే కాంగ్రెస్ సర్కార్ అక్రమ అరెస్టులకు తెరలేపిందని ఫైర్ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్