రాష్ట్రంలో రెండు కాంగ్రెస్‌లు: హరీష్ రావు

45738చూసినవారు
రాష్ట్రంలో రెండు కాంగ్రెస్‌లు: హరీష్ రావు
తెలంగాణలో రెండు కాంగ్రెస్‌ పార్టీలు నడుస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఒకటి రాహూల్‌ గాంధీ కాంగ్రెస్‌.. మరొకటి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అని విమర్శించారు. రేవంత్‌ ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కాదని, ఆయన ఎజెండా వేరు, రాహుల్‌ ఎజెండా వేరుగా ఉందన్నారు. గుజరాత్‌ మోడల్‌ను మోడీ ఎదుట రేవంత్‌ పొగిడారని, రాహుల్‌ మాత్రం గుజరాత్‌ మోడల్‌ డొల్ల అని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. రేవంత్‌ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్