ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 128లోని జేపీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగిని కలిసేందుకు మంగళవారం ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. హాస్పిటల్ కార్డ్ లేకుండా రోగిని సందర్శించకూడదని సెక్యూరిటీ గార్డ్ వారిని ఆపాడు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు వ్యక్తులు ఆ సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి, కిందకు తోసి కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా సెక్యూరిటీ గార్డును పక్కకు తోసేశారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.