ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ జాతీయ అజెండాలోని పలు అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేసి గెలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా దాన్ని నెత్తికెత్తుకున్నారు. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం తర్వాత పవన్ పూర్తి బీజేపీ నేతగా కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఏపీలో పవన్ సాయంతో కాషాయ అజెండాను జనంలోకి తీసుకెళ్లి ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తోంది.