రష్యాలోని కజాన్ నగరంపై శనివారం ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. పలు నివాస సముదాయాలపై ఎనిమిది డ్రోన్ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో కజాన్‌లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు రష్యా ఏవియేషన్ వాచ్‌డాగ్ రోసావియాట్సియా ప్రకటించింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
కాగా కొద్ది రోజులుగా రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.