జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల 17న శనిదేవుడు కుంభరాశిలోకి తిరోగమనం చేయబోతున్న క్రమంలో త్రికోణ రాజయోగం ఏర్పడనుందని పండితులు పేర్కొంటున్నారు. దీంతో వృషభ రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. మేష రాశి వారికి ధనలాభం, వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జిస్తారు. సింహ రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడతుందని పేర్కొంటున్నారు.