వైసీపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొవడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం 85 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. మరో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు సాగిస్తోంది. ఏడో విడత జాబితాపై తాజాగా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. త్వరలోనే తుది జాబితా విడుదల అవుతుందని, మరో జాబితా ఉండకపోవచ్చని అన్నారు.