ఆగని కార్చిచ్చు.. 24కు పెరిగిన మృతుల సంఖ్య

71చూసినవారు
అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చుకు 24 మంది మరణించారు. మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదు. ముందు జాగ్రత్త చర్యగా లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీలోని 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటివరకు కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని అన్నీ దగ్ధమయ్యాయి. ఇది శాన్‌ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా చాలా ఎక్కువ. 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కార్చిచ్చును అదుపు చేసేందుకు కృషి చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్