హైదరాబాద్‌లో సినిమా థియేటర్లపై పోలీసుల దృష్టి

82చూసినవారు
హైదరాబాద్‌లో సినిమా థియేటర్లపై పోలీసుల దృష్టి
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సినిమా థియేటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల సందర్భంగా థియేటర్ యజమానులకు ఇప్పటికే పలు సూచనలు చేశారు. థియేటర్ల వద్ద హంగామా ఉండకూడదని, నిబంధనలు పాటించాలని తెలిపారు. టికెట్లు ఉన్న ప్రేక్షకులను మాత్రమే థియేటర్లలోకి పంపించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్