కొన్ని లావాదేవీలకు సంబంధించి ఖాతాదారుల సమస్యలను పరిష్కరించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుంటాయి. దీనికి చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానా ద్వారా ఖాతాదారులకు రోజుకు రూ.100 చెల్లించనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి.