ఓ యువకుడు గోడ మీద నించుని డాన్స్‌ను చేయాలనుకున్నాడు. కొంచెం స్టెప్పులు వేద్దామని కాలు కదిలించబోయే సరికి బ్యాలెన్స్ కుదరకా గోడ మీద నుంచి కింద పడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను నిల్చున్న ప్రదేశంలో ఏదో జాతరలాంటి కార్యక్రమం జరుగుతున్నట్లు అర్థమవుతోంది. అందరిని ఆకర్షించేందుకు అతను ఇలా చేసి ఉండవచ్చని, పాపం అతనికి గోడ సపోర్టు చేయలేదని పలువురు నెటిజన్లు అంటున్నారు.