AP: మాజీమంత్రి విడదల రజినిపై సోషల్ మీడియాలో చాలా దుర్మార్గమైన పోస్టులు పెట్టారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ వాళ్లపై అసభ్యకరంగా పోస్టులు పెడితే తమకు ఆనందంగా ఉందా? మాజీ మంత్రి విడదల రజిని ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. గుర్తుపెట్టుకోండి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు' అని అన్నారు.