తూర్పు గోదావరి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. అలాంటి జిల్లాలో కొందరు సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా పార్టీని, అటు చంద్రబాబును కూడా బద్నాం అయ్యేలా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరి అజెండాలు వారికి ఉన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. సీనియర్ నాయకులే పార్టీ పరువును పాడుచేసేలా వ్యవహరించడం సొంత నేతల్లోనే చర్చకు దారి తీస్తుంది.