విజయ్ సేతుపతి కీలక పాత్రలో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విడుదల-2’. ‘విడుదల’ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి తొలి భాగం అందుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ మూవీ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇది తమిళ, తెలుగు భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.