AP: పేదరికం లేని సమాజం టీడీపీతోనే సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయమంటే పెత్తందారి విధానం కాదని, పేదల జీవితాలు మార్చేదని అన్నారు. ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీఆర్ అని, ఆడబిడ్డలు చదువుకోవడానికి మహిళా విశ్వవిద్యాలయం పెట్టారన్నారు. పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీఆర్ కల అన్నారు. రాయలసీమ రతనాల సీమ కావాలని ఆనాడే తెలుగు గంగ, హంద్రీవీవా, గాలేరు నగరి కాల్వలు ప్రారంభించారన్నారు.