కోస్గి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ

74చూసినవారు
కోస్గి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో దివ్యాంగుల కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పరిరక్షణ సమితి కమిటీ సభ్యురాలు ఝాన్సీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ. ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగ ఫలితమే స్వాతంత్య్రం అన్నారు. ఈ కార్యక్రమంలో సరిత, రాధమ్మ, నారాయణమ్మ, శిరీష, దౌల్తాబాద్ మండలానికి చెందిన దస్తప్ప, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you