రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా

75చూసినవారు
రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రైల్వేలో ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆమె రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా ఉద్యోగం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఆమె ఈ ఉద్యోగం పొందారు. కాసేపటిలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో రెజ్లర్ బజరంగ్ పునియా సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

సంబంధిత పోస్ట్