సాంకేతిక లోపం.. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం

68చూసినవారు
సాంకేతిక లోపం.. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సంస్థ కార్యకలాపాలు, విమాన సేవలపైనా ప్రభావం పడింది. ఎయిర్‌పోర్టుల్లో చెక్-ఇన్‌లు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని ఇండిగో ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ప్రయాణికుల అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు మా ఎయిర్‌పోర్టు బృందం సిద్ధంగా ఉందని వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్