మోదీ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలి: కొండా

201742చూసినవారు
మోదీ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలి: కొండా
ప్రధాని మోదీ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించి కమలం పువ్వుకు ఓటు వేయించే బాధ్యత బూత్ స్థాయి కమిటీల సభ్యుల పైనే ఉందని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శంషాబాద్, సిద్ధాంతి బస్తీలకు చెందిన వంద మంది భారాస నాయకులు, కార్యకర్తలు అజీజ్నగర్లోని విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయంలో భాజపా తీర్ధం పుచ్చుకున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో సమష్టిగా కృషి చేస్తే విజయం మనదే అన్నారు. నందకిషోర్, కుమార్యాదవ్, మేకల ఆనంద్, మహేందర్, వంశీ, బన్నీ, వీరేందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :