పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రచారంలో టిఆర్ఎస్ నాయకులు
వనపర్తి జిల్లాకేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మెరకు వనపర్తిలోని 33వ వార్థులో ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం టిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ అక్టోబర్ 1తేదీనుండి తమ ఓటును నమోదు చేసుకుని టిఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని ఎన్నుకోవ్వాలని ఇంటింటికి వెళ్లి కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉంగ్లంతిరుమల్, కడేంశేఖర్, గొంది రేణుబాబు, నాగేశ్వరరావు(కిట్టు), అజయ్ కుమార్ పాల్గొన్నారు.