ఒక్కటైన అమెరికా అమ్మాయి, వనపర్తి అబ్బాయి

61చూసినవారు
ఒక్కటైన అమెరికా అమ్మాయి, వనపర్తి అబ్బాయి
వనపర్తి జిల్లాకు చెందిన అబ్బాయి, అమెరికా అమ్మాయి ఒక్కటయ్యారు. ఆదివారం వనపర్తిలోని రాజనగరం రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్ లో అమెరికా అమ్మాయి నాతలీజో, పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత తమ్ముడు, శాస్త్రవేత్త నరేశ్ యాదవ్ కు పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక, రాజకీయ నేతలు పాల్గొని జంటను ఆశీర్వదించారు. పెళ్లి కుమార్తె విదేశీ అమ్మాయి కావడంతో ఈ వేడుక పట్ల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్