Mar 21, 2025, 04:03 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు
Mar 21, 2025, 04:03 IST
నారాయణపేటలో శుక్రవారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 7631 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అధికారులు తనిఖీల అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద త్రాగునీరు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు.