వినూత్నంగా రీల్స్ చేయాలనుకున్న ఓ యువతి అది బెడిసి కొట్టడంతో కింద పడి దెబ్బలు తింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి తన క్లాస్‌రూంలో వినూత్నంగా డ్యాన్స్ చేయాలనుకుంది. అది కూడా నేలపై కాకుండా ఏకంగా బెంచి పైకి ఎక్కి డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డ్యాన్స్ చేసే క్రమంలో అత్యత్సాహం ప్రదర్శించడంతో అదుపు తప్పి టేబుల్ పైనుంచి కిందపడిపోయింది.