VIDEO: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి

568చూసినవారు
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో ఒక్కసారిగా నాలుగు పిల్లర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్