Oct 20, 2024, 12:10 IST/
బద్వేల్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు
Oct 20, 2024, 12:10 IST
బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేశాడని పోలీసులు తెలిపారు. 'ఐదేళ్లుగా వారికి పరిచయం ఉంది. ప్రేమించుకుని విడిపోయారు. సూసైడ్ చేసుకుంటానని బెదిరించడంతో అమ్మాయి అతడిని కలవడానికి వెళ్లింది. ఇద్దరూ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఇష్టపూర్వకంగా లైంగికంగా కలిశారు. తర్వాత వాగ్వాదం జరగగా, విఘ్నేశ్ ఆమెకు నిప్పటించాడు' అని కడప ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు.