భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో గోదావరి నది హారతి ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి అలయం నుండి అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు మంగళ వాయిద్యాలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకొని గోదావరి మాతకు అర్చకులు పాలు, పూలు, పండ్లు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూడు హారతులు వైభవంగా నిర్వహించారు.