భూపాలపల్లి జిల్లా మంజూరునగర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 99 మంది లబ్ధిదారులు భూపాలపల్లి గణపురం, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లికి చెందిన వారున్నారు. మొత్తం చెక్కుల విలువ రూ. 25. 68 లక్షలు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు.