భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామాలయంలో ఆలయ అర్చక బృందం గరుడ వాహనంపై సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకు తిరుప్పావై సేవా కాలం, చతుర్వేద పారాయణం, నవహారతులు, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తరద్వారం ద్వార భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.