కాళేశ్వరం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

65చూసినవారు
భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకొని గణనాధులకు విశేష పూజలు నిర్వహించారు‌. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో గణనాధుడిని నెలకొల్పారు. మంగళ వాయిద్యాల, అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య గణనాధుడి విగ్రహాన్ని కాలినడకన గర్భాలయంలోకి తీసుకొచ్చి నెలకొల్పారు. గణనాధుడికి విశేష పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్